EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Guntur
OFFICIAL MEETINGS
OFFICIAL

Guntur

Conducted: 15 October, 2026 Guntur Venue: Tamil Nadu ANTF–Andhra Pradesh EAGLE Coordination Meeting to Strengthen the Fight Against Drugs- EAGLE HEAD QUATERS EAGLE 10 Attendees
డ్రగ్స్ నియంత్రణలో తమిళనాడు ANTF – ఆంధ్రప్రదేశ్ EAGLE సమన్వయం మరింత బలోపేతం

🔹 అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఉమ్మడి నిఘా, ఇంటెలిజెన్స్ షేరింగ్‌కు నిర్ణయం

🔹 సాంకేతిక పరిజ్ఞానం, సరిహద్దు నిఘా, ఉమ్మడి ఆపరేషన్లకు పెద్దపీట

🔹 యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు Prevention–Rehabilitationపై ప్రత్యేక దృష్టి

📍 మంగళగిరి | 15 అక్టోబర్ 2026

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా, విక్రయాలను సమర్థంగా అరికట్టడంతో పాటు అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను మూలస్థాయి నుంచే ఛేదించే దిశగా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక అడుగువేశారు.

తమిళనాడు ఐజీపీ, క్రైమ్ బ్రాంచ్ మరియు ANTF శ్రీ A. Saravana Sundar, IPS మరియు ఆంధ్రప్రదేశ్ EAGLE IGP శ్రీ ఆకే. రవికృష్ణ, IPS ఆధ్వర్యంలో మంగళగిరిలో తమిళనాడు ANTF – ఆంధ్రప్రదేశ్ EAGLE ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో అంతర్రాష్ట్ర ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, డ్రగ్స్ సరఫరా మార్గాలు, హాట్‌స్పాట్లు, సరిహద్దు ప్రాంతాలపై నిఘా, రైల్వే మరియు రహదారి మార్గాల పర్యవేక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఉమ్మడి ఆపరేషన్లు, NCBతో సమన్వయం, ఔషధాల దుర్వినియోగ నియంత్రణ, యువతలో నివారణ చర్యలు, డీ-అడిక్షన్ మరియు రిహాబిలిటేషన్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

⭐ EAGLE పనితీరును ప్రశంసించిన తమిళనాడు IGP

సమావేశంలో తమిళనాడు ఐజీపీ, క్రైమ్ బ్రాంచ్ మరియు ANTF శ్రీ A. Saravana Sundar, IPS మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ EAGLE వ్యవస్థ చాలా బాగా పనిచేస్తోందని, డ్రగ్స్ నియంత్రణలో EAGLE అనుసరిస్తున్న విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.

ముఖ్యంగా డ్రగ్స్ నియంత్రణలో Technology, Intelligence Sharing, Field-Level Enforcementను సమన్వయం చేస్తూ EAGLE ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమని తెలిపారు.

డ్రగ్స్‌పై అవగాహన, ప్రజల భాగస్వామ్యం పెంపొందించడంలో EAGLE సోషల్ మీడియా ద్వారా చేపడుతున్న ప్రచార కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ముఖ్యంగా యువతను చేరుకోవడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.

EAGLE వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాలు, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు తమకు కూడా ఉపయోగకరమైన అంశాలని, భవిష్యత్తులో తమిళనాడు ANTFలో కూడా ఇలాంటి మంచి విధానాలను పరిశీలించి, అవసరమైన మేరకు అనుసరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

భవిష్యత్తులో తమిళనాడు ANTF – ఆంధ్రప్రదేశ్ EAGLE మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాలు, ఉమ్మడి చర్యలను మరింత బలోపేతం చేసుకుని, రెండు రాష్ట్రాల సహాయ సహకారాలతో డ్రగ్స్ నియంత్రణలో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

🔴 జీరో టాలరెన్స్ (Zero Tolerance) విధానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన జీరో టాలరెన్స్ విధానానికి అనుగుణంగా మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

గంజాయి సాగు నుంచి మొదలుకుని: వినియోగం,పెడ్లింగ్,రవాణా,సరఫరా,ఫైనాన్సింగ్

వరకు మొత్తం నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.

Enforcement, Prevention, Rehabilitation, Coordination అనే నాలుగు స్తంభాల ఆధారంగా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు.

🦅 EAGLE నాలుగు స్తంభాల వ్యూహం

🔹 Enforcement (అమలు): డ్రగ్స్ సరఫరా, అక్రమ రవాణా మరియు పెడ్లర్లపై రాజీలేని కఠిన చర్యలు.

🔹 Prevention (నివారణ): యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులలో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు.

🔹 Rehabilitation (పునరావాసం): డ్రగ్స్‌కు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్, రిహాబిలిటేషన్ సేవలకు అనుసంధానించడం.

🔹 Coordination (సమన్వయం): పోలీస్, వైద్య, విద్య, రెవెన్యూ, ఎక్సైజ్, NCB తదితర శాఖలు మరియు పొరుగు రాష్ట్రాలతో నిరంతర సమాచార మార్పిడి.

🌐 అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లపై ఉమ్మడి నిఘా

ఆంధ్రప్రదేశ్‌కు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి వస్తున్న డ్రగ్స్ సరఫరా మార్గాలను గుర్తించి Backward మరియు Forward Linkagesపై లోతైన దర్యాప్తు సాగిస్తున్నారు.

ఒడిశా, కర్ణాటక సరిహద్దులు, రహదారి మరియు రైల్వే మార్గాలు, ఫీడర్ రోడ్లపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

పొరుగు రాష్ట్రాల ANTF, స్థానిక పోలీసు శాఖలు మరియు NCB అధికారులతో కలిసి సంయుక్తంగా సమాచారాన్ని పంచుకుంటూ మూలాలను దెబ్బతీస్తున్నారు.

🚆 రైల్వే మార్గాలపై ప్రత్యేక దృష్టి

డ్రగ్స్ రవాణాకు రైళ్లను ఆశ్రయించే అసాంఘిక శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రైల్వే నెట్‌వర్క్‌పై నిఘా పెంచారు.

రైల్వే మార్గాల్లో గంజాయి, MDMA, ఇతర సింథటిక్ డ్రగ్స్ రవాణాపై ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

☎️ ప్రజల భాగస్వామ్యంతో ‘1972’ హెల్ప్‌లైన్

“Your Voice Can Save a Life” నినాదంతో 1972 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 24×7 పనిచేస్తోంది.

ప్రజలు, విద్యార్థులు, యువకులు గంజాయి సాగు, పెడ్లర్ల సమాచారాన్ని ఎటువంటి భయం లేకుండా అనామకంగా అందించేలా “BREAK THE SILENCE – CALL EAGLE 1972” ప్రచారం నిర్వహిస్తున్నారు.

🌱 గ్రామీణ స్థాయిలో “పల్లెబాటలో EAGLE” & “వజ్ర ప్రహార్”

🔹 పల్లెబాటలో EAGLE: గంజాయి సాగుకు పేరొందిన గిరిజన ప్రాంతాల్లో స్థానిక ప్రజలతో మమేకమై అవగాహన కల్పిస్తూ, ప్రత్యామ్నాయ పంటల సాగును Operation Chaitanyam ద్వారా ప్రోత్సహిస్తున్నారు.

🔹 వజ్ర ప్రహార్: అనుమానాస్పద ప్రాంతాలు, పాత నేరస్థులు, హాట్‌స్పాట్లపై నిరంతరం ఆకస్మిక తనిఖీలు (Surprise Visits & Searches) చేపడుతున్నారు.

🔹 Operation Garuda: మెడికల్ షాపుల్లో OTC, NRx, H-H-M డ్రగ్స్ మరియు ఓపియాయిడ్స్ అక్రమ మళ్లింపును అరికట్టడానికి ఆరోగ్య, డ్రగ్ కంట్రోల్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ 2025లో 1,607 మెడికల్ షాపులను తనిఖీ చేశారు.

సమాజానికి ముప్పుగా మారుతున్న నేరస్థులపై సాధారణ చట్టాలతో పాటు PITNDPS Act, 1988 కింద ఇప్పటివరకు 200 మందిపై నివారణాత్మక చర్యలు తీసుకున్నారు.

👨‍🎓 యువతను కాపాడేందుకు Prevention & Rehabilitation

విద్యాసంస్థల్లో EAGLE Clubs, Anti-Drug Campaigns ద్వారా విద్యార్థులను “Safe Campus – No Alcohol, No Drugs” దిశగా నడిపిస్తున్నారు.

డ్రగ్ బానిసలను గుర్తించి Indian Red Cross Society భాగస్వామ్యంతో డీ-అడిక్షన్, పునరావాస కేంద్రాలకు అనుసంధానిస్తూ భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు.

🤝 సమిష్టి లక్ష్యం – డ్రగ్-రహిత దక్షిణ భారతదేశం

తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య Hotspots, Peddlers, Transit Routes మరియు Financial Linkagesపై ఇంటెలిజెన్స్ సమాచారాన్ని వేగంగా పంచుకుంటూ Joint Operations నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

“Inter-State Coordination is the Key” అనే నినాదంతో రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా Drug-Free South India సాధన దిశగా అడుగులు వేస్తున్నాయి.

భవిష్యత్తులో రెండు రాష్ట్రాల పోలీస్ శాఖలు పరస్పర సహకారంతో Technology, Intelligence, Enforcement, Prevention మరియు Social Media Awareness రంగాల్లో మంచి విధానాలను పరస్పరం పంచుకుని మరింత సమర్థవంతంగా పనిచేయాలని నిర్ణయించారు.

🦅 డ్రగ్స్‌పై పోరాటం – సరిహద్దులు దాటి సమన్వయంతో మరింత బలంగా!

Tamil Nadu ANTF × Andhra Pradesh EAGLE

Together for a Drug-Free South India.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.