EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Nandyal - Nandyal SDPO - Nandyal Taluk
Pallebatalo EAGLE
OFFICIAL

Nandyal - Nandyal SDPO - Nandyal Taluk

Conducted: 30 September, 2026 Nandyal Venue: Venkateswara Puram Village EAGLE 30 Attendees

తేదీ: 30.09.2026
నంద్యాల ఈగల్ సెల్.

గౌరవ ఐ.జి.పి. శ్రీ *ఆకే రవి కృష్ణ* , IPS, IGP సార్, శ్రీ K.M మహేశ్వరరాజు,IPS,SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP మేడమ్ వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలోని ప్రజలకు మత్తు పదార్దాల పైన *పల్లెబాటలో - ఈగల్* మరియు *BREAK the Silence call Eagle 1972* అవగాహన కార్యక్రమములు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజలు వారి గ్రామంలో గానీ, చుట్టు పక్కల పరిసరాలలో గానీ ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్దాలు వినియోగించిన, అమ్మడం, కొనడం, రవాణా చేయడం వంటివి చూసినా లేదా వాటి సమాచార తెలిసినా *మౌనంగా ఉండకుండా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972* కు తెలియజేయాలని తెలపడం జరిగింది. అలాగే గంజాయి మరియు ఇతర మత్తు పదార్దాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావాలు, నేరచరిత్రపై పడే ప్రభావాలు, వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గంజాయి కొనిన, అమ్మిన, రవాణా చేసిన, వినియోగించిన, కలిగివున్న, సాగుచేసిన వారికి NDPS చట్టం కింద కేసులలో విధించే శిక్షలు మరియు జరిమానాల గురించి తెలియజేయడమైనది. మత్తు పదార్థాలకు ఎవరైనా బానిస అయితే వారిని *De-addiction* సెంటర్ లో చేర్పించి చికిత్స చేయించవచ్చు అని తెలపడం జరిగింది. గంజాయి మరియు ఇతర మత్తు పదార్దాల సమాచారం ఉంటే *ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972* కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరములను గోప్యంగా ఉంచబడునని తెలపడమైనది. NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సుమారు 30 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.