EAGLE
Sri Ake Ravi Krishna, IPS (Eagle Chief & IGP), paid a courtesy call on the Deputy Chief Minister of Andhra Pradesh, sri Konidela Pawan Kalyan.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ చీఫ్ & ఐజీపీ శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రివర్యులకు అందజేశారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఈగల్ విభాగం చేపడుతున్న ప్రత్యేక చర్యలు, అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, డ్రోన్ సర్వైలెన్స్, ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ వంటి కార్యక్రమాల ద్వారా సాధించిన ఫలితాలను శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు.
అదేవిధంగా మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, EAGLE టోల్ ఫ్రీ నంబర్–1972 ద్వారా అందుతున్న సమాచారంతో సాధించిన విజయాలను, ఈగల్ విభాగం భవిష్యత్ కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు.