EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 10 August, 2026
100%
EAGLE
Outreach Drugs Vaddu Bro
Awareness
OFFICIAL

Drugs Vaddu Bro

తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో పోలవరం జిల్లా, మారేడుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” అనే అంశంపై అవగాహన కార్యక్రమం.

Published: 07 July, 2026 - 07 July, 2026
POLAVARAM

Drugs Vaddu Bro

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈగల్ (Elite Anti Narcotics Group for Law Enforcement), తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో పోలవరం జిల్లా, మారేడుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఈగల్ అధికారులు విద్యార్థులకు గంజాయి, సింథటిక్ డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు సృజనాత్మక కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు.

అదేవిధంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ – 1972 కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఈగల్ అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని “డ్రగ్స్ వద్దు బ్రో – మంచి జీవితానికి అవును చెప్పండి” అనే సందేశాన్ని సమాజానికి చేరవేయాలని ప్రతిజ్ఞ చేశారు. 

Other Campaigns
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.