EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 10 August, 2026
100%
EAGLE
Outreach DRUG VADDU BRO
Awareness
OFFICIAL

DRUG VADDU BRO

ASR జిల్లా – చింతపల్లి అమరావతి ఒకేషనల్ కాలేజీలో డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం.

Published: 06 July, 2026 - 06 July, 2026
EAST GODAVARI

DRUG VADDU BRO

ASR జిల్లా – చింతపల్లి అమరావతి ఒకేషనల్ కాలేజీలో డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం.

మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా, ASR జిల్లా చింతపల్లిలోని అమరావతి ఒకేషనల్ కాలేజీలో ఈగల్ (Elite Anti Narcotics Group for Law Enforcement) ఆధ్వర్యంలో డ్రగ్స్ దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, సింథటిక్ డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యం, విద్య, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే తీవ్ర ప్రభావాలను వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని, సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు.
అలాగే విద్యార్థులతో "డ్రగ్స్‌కు నో చెప్పండి – జీవితానికి యెస్ చెప్పండి" అనే ప్రతిజ్ఞ చేయించారు.

అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ – 1972 కు తెలియజేయాలని కోరారు.

Gallery

Other Campaigns
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.