🦅 అనంతపురం జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 08-10-2026
🚫 “ డ్రగ్స్ వద్దు బ్రో ” – మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం
BREAK THE SILENCE – CALL 1972
📍 జిల్లా: అనంతపురం
🏢 సబ్ డివిజన్: అనంతపురం రూరల్ సబ్ డివిజన్
👮 పోలీస్ స్టేషన్ : ఇటుకలపల్లి
🏫 స్థలం : అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల, ఇటుకలపల్లి.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, *ఈరోజు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 300 మంది కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, విద్యా, ఆర్థిక మరియు భవిష్యత్ నష్టాలపై అవగాహన కల్పించారు.* చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టి సారించాలని సూచించారు.
⚖️ చట్టపరమైన అవగాహన:
NDPS Act–1985, COTPA Act మరియు Safe Zone Campus కార్యక్రమాల ఉద్దేశ్యాలను వివరించి, మాదకద్రవ్యాలు, పొగాకు తదితర హానికర పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. EAGLE ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న Operation Vajraprahar, Operation Garuda మరియు Operation Chaitanya కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించారు.
📞 సమాచారం అందించేందుకు:
మాదకద్రవ్యాల అక్రమ విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే *EAGLE టోల్‌ఫ్రీ 1972 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
🤝 మాదకద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ:
ఈ సందర్భంగా సుమారు 300 మంది విద్యార్థిని విద్యార్థులతో మాదకద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు “మేము డ్రగ్స్ జోలికి వెళ్లము, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాము. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం మా దృష్టికి వచ్చిన వెంటనే 1972కు సమాచారం అందిస్తాము” అని ప్రతిజ్ఞ చేశారు.
👥 ఈ కార్యక్రమంలో *కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది మరియు అనంతపురం జిల్లా ఈగల్ టీం అధికారి శ్రీ బి.హనుమంతు గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.