🦅 అన్నమయ్య జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 08-10-2026
🚫 “ డ్రగ్స్ వద్దు బ్రో ” – మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం
BREAK THE SILENCE – CALL 1972
📍 జిల్లా : అన్నమయ్య
🏢 సబ్ డివిజన్ : మదనపల్లి
👮 పోలీస్ స్టేషన్ : మదనపల్లి II టౌన్
🏫 స్థలం : శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల, మదనపల్లి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, *ఈరోజు మదనపల్లి II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాలలో EAGLE సెల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 500 మంది కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, విద్యా, ఆర్థిక మరియు భవిష్యత్ నష్టాలపై అవగాహన కల్పించారు.* చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టి సారించాలని సూచించారు.
⚖️ చట్టపరమైన అవగాహన:
NDPS Act–1985, COTPA Act మరియు Safe Zone Campus కార్యక్రమాల ఉద్దేశ్యాలను వివరించి, మాదకద్రవ్యాలు, పొగాకు తదితర హానికర పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. EAGLE ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న Operation Vajraprahar, Operation Garuda మరియు Operation Chaitanya కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించారు.
📞 సమాచారం అందించేందుకు:
మాదకద్రవ్యాల అక్రమ విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ 1972 కు లేదా అన్నమయ్య జిల్లా పోలీస్ WhatsApp – 8688830014కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
🤝 మాదకద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ:
ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులతో మాదకద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు “మేము డ్రగ్స్ జోలికి వెళ్లము, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాము. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం మా దృష్టికి వచ్చిన 1972కు సమాచారం అందిస్తాము” అని ప్రతిజ్ఞ చేశారు.
👥 ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది మరియు అన్నమయ్య జిల్లా EAGLE టీమ్‌కు చెందిన శ్రీ పి. శ్రీనివాసులు పాల్గొన్నారు.