EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Alluri Sitharama Raju - Paderu SDPO - Paderu UPS
Awareness
OFFICIAL

Alluri Sitharama Raju - Paderu SDPO - Paderu UPS

Conducted: 08 October, 2026 Alluri Sitharama Raju Venue: Paderu Coffee House EAGLE 300 Attendees
పాడేరు కాఫీ హౌస్‌లో డ్రగ్స్, పోక్సో, రోడ్డు భద్రత, బాల్య వివాహాలపై అవగాహన కల్పించిన ASR జిల్లా EAGLE సెల్
అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ హౌస్‌లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన అవగాహన స్టాల్స్‌లో భాగంగా ASR జిల్లా EAGLE సెల్ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించింది.
గౌరవ IGP శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, SP శ్రీ K.M. మహేశ్వర రాజు, IPS, మరియు SP, EAGLE శ్రీమతి D. స్వరూప రాణి, IPS గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో EAGLE బృందం పాల్గొంది.
ఈ సందర్భంగా EAGLE శాఖ ఏర్పాటు, దాని విధులు, ప్రభావంతో పాటు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, ఆపరేషన్ ఆన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ తదితర కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలు, కుటుంబాలపై వాటి ప్రభావం, NDPS చట్టాలు మరియు మాదకద్రవ్యాల కేసుల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తుపై పడే ప్రభావాలపై అవగాహన కల్పించారు.
“BREAK THE SILENCE – CALL EAGLE 1972” కార్యక్రమంలో భాగంగా గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగం లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ప్రజలకు వివరించారు. ఈ నంబర్‌ను ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్, విశాఖపట్నం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ న్యాయమూర్తి, AD Disabled Welfare, వివిధ శాఖల అధికారులు, పాడేరు CI, EAGLE సెల్ సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది మరియు సుమారు 300 మంది ప్రజలు పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.