EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Chandragiri SDPO - Tirupati Rural UPS
Awareness
OFFICIAL

Tirupathi - Chandragiri SDPO - Tirupati Rural UPS

Conducted: 08 October, 2026 Tirupathi Venue: SV Defence Kabaddi Ground, Tirupati EAGLE 60 Attendees
EAGLE – తిరుపతి జిల్లా
తిరుపతి సబ్-డివిజన్
MR పల్లి పోలీస్ స్టేషన్
డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ – “Break the Silence” & “Operation Trishool” అవగాహన కార్యక్రమం
తేదీ: 08-10-2026
స్థలం: SV Defence Kabaddi Ground, తిరుపతి
🎓 అవగాహన కార్యక్రమం
EAGLE Organization – తిరుపతి జిల్లా మరియు MR పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో SV Defence Kabaddi Groundలో కబడ్డీ క్రీడాకారులకు డ్రగ్స్ నివారణ మరియు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో EAGLE Organization తరఫున శ్రీ గోవింద స్వామి, శ్రీ కామేశ్వర నాయుడు, శ్రీ గిరిబాబు, శ్రీ కమల్ మరియు MR పల్లి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీరాములు, వారి సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడాకారులకు ప్రధానంగా క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:

డ్రగ్స్ నివారణ మరియు దుష్ప్రభావాలు
🛡️ Operation Safe Campus
ర్యాగింగ్ నివారణ
👩 మహిళల భద్రత
సైబర్ క్రైమ్స్‌పై అవగాహన సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం

☠️ Narco-Terrorism
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చే నిధులను ఉగ్రవాదం లేదా ఇతర నేర కార్యకలాపాలకు వినియోగించడం ద్వారా దేశ భద్రతకు కలిగే ముప్పు, అలాగే డ్రగ్స్‌కు యువతను బానిసలుగా మార్చడం ద్వారా సమాజాన్ని దెబ్బతీయడం వంటి అంశాలపై Narco-Terrorism గురించి వివరించారు.

👉 డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సూచించారు.

🏫 Operation Safe Campus
“Safe Campus – Drug-Free Campus – Ragging-Free Campus” అనే లక్ష్యంతో ప్రతి విద్యార్థి బాధ్యతాయుతమైన యువతగా వ్యవహరించాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్‌కు పాల్పడకుండా ఇతరులను కూడా రక్షించాలని సూచించారు.

ఆటస్థలం మరియు పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయం, వినియోగం లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే EAGLE Toll-Free No. 1972కు సమాచారం అందించాలని క్రీడాకారులకు సూచించారు.

📢 “Drugs Vaddu Bro – Life Muddu Bro”
📢 “Drug-Free Andhra Pradesh”
🏫 “Safe Campus – Drug-Free Campus – Ragging-Free Campus”
🌱 యువతే దేశ భవిష్యత్తు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
EAGLE – Tirupati District
Drugs Vaddu Bro!
🇮🇳 మన యువతను కాపాడుకుందాం – మన సమాజాన్ని కాపాడుకుందాం!
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.