EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kakinada - Peddapuram SDPO - Prathipadu
Awareness
OFFICIAL

Kakinada - Peddapuram SDPO - Prathipadu

Conducted: 08 October, 2026 Kakinada Venue: ధర్మవరం Z.P.H.S. స్కూల్ EAGLE
EAGLE KAKINADA DISTRICT – అవగాహన కార్యక్రమం

తేదీ: 08-10-2026

Sub-Division: Peddapuram

Police Station: Prathipadu P.S.

📍 వేదిక: ధర్మవరం Z.P.H.S. స్కూల్

ఈ రోజు ధర్మవరం Z.P.H.S. స్కూల్‌లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు BREAK THE SILENCE అంశంపై EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

గౌరవ IGP శ్రీ ఆకే రవికృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు EAGLE సెల్, కాకినాడ జిల్లా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాలు మరియు ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై కలిగే ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. NDPS Act–1985 గురించి, మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలను వివరించారు.

BREAK THE SILENCEలో భాగంగా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా బాధ్యతగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, తమ స్నేహితులు లేదా పరిచయస్తులు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.

అలాగే EAGLE చేపడుతున్న చైతన్యం, గరుడ, సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్, వజ్రప్రహార్ మరియు ఇతర డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు.

“డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.”

ఈ కార్యక్రమంలో EAGLE కాకినాడ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిపి సుమారు 400 మంది పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.