EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Sri Sathya Sai - Hindupur SDPO - Hindupur I Town
Awareness
OFFICIAL

Sri Sathya Sai - Hindupur SDPO - Hindupur I Town

Conducted: 08 October, 2026 Sri Sathya Sai Venue: శ్రీ బాలాజీ డిగ్రీ మహిళా కళాశాల EAGLE 296 Attendees
బ్రేక్ ద సైలెన్స్ – “కాల్ 1972”

డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం – నివేదిక

గౌరవనీయులైన ఐజీపీ ఈగల్ శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, శ్రీ మహేశ్వర్ రాజు, IPS గారు – SP, శ్రీమతి స్వరూపరాణి, IPS గారు – SP వారి ఆదేశాల మేరకు “బ్రేక్ ద సైలెన్స్ – కాల్ 1972” కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మండలం, హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ డిగ్రీ మహిళా కళాశాలలో విద్యార్థినులకు డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 296 మంది విద్యార్థినులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక మరియు కుటుంబపరమైన దుష్ప్రభావాల గురించి వివరించడం జరిగింది. కళాశాల యాజమాన్యం ఎంతో సౌమ్యంగా, సహకారపూర్వకంగా వ్యవహరించింది. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించడం జరిగింది.

అలాగే AP EAGLE టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1972 గురించి విద్యార్థినులకు వివరించడం జరిగింది. తమ పరిసరాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినప్పుడు దానిని తమలోనే ఉంచుకోకుండా వెంటనే 1972కు, స్థానిక పోలీసులకు లేదా సంబంధిత EAGLE సిబ్బందికి తెలియజేయాలని కోరడం జరిగింది. సమాచారం అందించే వ్యక్తుల సహకారం డ్రగ్స్ నిర్మూలనలో ఎంతో కీలకమని వివరించడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు EAGLE సోషల్ మీడియా వేదికలను సబ్‌స్క్రైబ్/ఫాలో చేయించడం ద్వారా EAGLE ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు మరియు ప్రజలకు అందిస్తున్న సమాచారాన్ని విస్తృతంగా చేరవేసేలా ప్రోత్సహించడం జరిగింది.

ఈ సందర్భంగా “దేశాన్ని ప్రేమించే ఏ ఒక్కరూ డ్రగ్స్‌ను ముట్టుకోరు” అనే సందేశాన్ని విద్యార్థినులకు అందిస్తూ, ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను సాధించి, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించడం జరిగింది.

అనంతరం విద్యార్థినులతో EAGLE ప్రతిజ్ఞ (Pledge) చేయించడం జరిగింది. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తామని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడంతో పాటు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి అనే సందేశాన్ని అందించడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.