EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kurnool - Kurnool SDPO - Kurnool III Town
Awareness
OFFICIAL

Kurnool - Kurnool SDPO - Kurnool III Town

Conducted: 08 October, 2026 Kurnool Venue: SRI SAI KRUHSNA DEGREE COLLEGE EAGLE 150 Attendees
EAGLE అవగాహన కార్యక్రమం – కర్నూల్
తేదీ: 08-10-2026
📍 వేదిక:
శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్
కర్నూల్.
సబ్ డివిజన్: కర్నూల్ అర్బన్
పోలీస్ స్టేషన్: 3 టౌన్ పోలీస్ స్టేషన్
Area:- డాక్టర్స్ కాలనీ.
శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు “BREAK THE SILENCE” అంశాలపై EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి EAGLE Organization, కర్నూల్ తరఫున ఈగల్ సిబ్బంది మరియు కళాశాల ప్రిన్సిపాల్ జిలాని గారు తదితరులు పాల్గొన్నారు.
🎓 మొత్తం 150 మంది కళాశాల విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
🚫 మాదక ద్రవ్యాలపై అవగాహన
విద్యార్థులకు NDPS Act – Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 గురించి వివరంగా అవగాహన కల్పించడం జరిగింది. మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలను వివరించారు.
🔇 BREAK THE SILENCE
డ్రగ్స్‌కు సంబంధించిన సమస్యలను దాచిపెట్టడం లేదా మౌనంగా ఉండటం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విద్యార్థులకు వివరించారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమస్య ఎదురైతే మౌనం వీడాలి – మాట్లాడాలి, సహాయం కోరాలి, సరైన మార్గదర్శకత్వం పొందాలి.
తమ స్నేహితులు లేదా పరిచయస్తులు డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్నట్లు లేదా బానిసలవుతున్నట్లు గుర్తించినప్పుడు, వారిని నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడి, అవసరమైన సహాయం అందించే దిశగా ముందుకు రావాలని సూచించారు.
“BREAK THE SILENCE

EAGLE Organization గురించి
EAGLE Organization యొక్క లక్ష్యాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలు, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు.

🇮🇳 Narco-Terrorism పై అవగాహన
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమాజానికి, ముఖ్యంగా యువతకు కలుగుతున్న నష్టంతో పాటు, Narco-Terrorism వల్ల దేశ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది.
విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా, తమ స్నేహితులు లేదా పరిచయస్తులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నట్లు గుర్తించినప్పుడు వారికి అవగాహన కల్పించి, అవసరమైన సహాయం అందించే విధంగా ముందుకు రావాలని సూచించారు.

📞 EAGLE Toll-Free Number – 1972
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు EAGLE Toll-Free Number – 1972కు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు.
అలాగే, విద్యార్థులు EAGLE Organization యొక్క Social Media Platforms‌ను Subscribe/Follow చేసి, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేయించారు.

🎯 యువతకు ప్రత్యేక సందేశం
“డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.”
“యువతే దేశ భవిష్యత్తు – డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి.”
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచడంతో పాటు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.