BREAK THE SILENCE – CALL EAGLE 1972 కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం జిల్లా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ సబ్-డివిజన్‌లో ఉన్న LOYOLA ITI COLLEGE విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
విద్యార్థులు తమ పరిసరాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి సమాచారాన్ని అందించాలని అవగాహన కల్పించారు. “BREAK THE SILENCE” సందేశం ద్వారా డ్రగ్స్‌పై మౌనం వీడి, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో Pledge చేయించారు.