EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Sri Sathya Sai - Dharmavaram SDPO - Dharmavaram I Town
Awareness
OFFICIAL

Sri Sathya Sai - Dharmavaram SDPO - Dharmavaram I Town

Conducted: 07 October, 2026 Sri Sathya Sai Venue: శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల EAGLE 250 Attendees
బ్రేక్ ద సైలెన్స్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం
IGP EAGLE గారి మరియు SP శ్రీ మహేశ్వర్ రాజు, IPS గారు, శ్రీమతి స్వరూపరాణి, IPS గారి ఆదేశాల మేరకు, ఈరోజు ధర్మవరం మండలంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో EAGLE ఆధ్వర్యంలో “బ్రేక్ ద సైలెన్స్” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలను వివరించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించడం జరిగింది. అలాగే EAGLE టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1972 గురించి విద్యార్థులకు తెలియజేసి, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే EAGLEకు సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్ ముట్టుకోరని విద్యార్థులు కాబోయే దేశ పౌరులుగా తమ బాధ్యతను గుర్తించి, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ బాగా చదువుకుని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించడం జరిగింది.
అనంతరం విద్యార్థులతో EAGLE ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ కుటుంబం, స్నేహితులు మరియు సమాజంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కల్పించాలని విద్యార్థులకు పిలుపునివ్వడం జరిగింది.
“డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.