EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Alluri Sitharama Raju - Paderu SDPO - Paderu UPS
Awareness
OFFICIAL

Alluri Sitharama Raju - Paderu SDPO - Paderu UPS

Conducted: 07 October, 2026 Alluri Sitharama Raju Venue: పాడేరు EAGLE 120 Attendees
ASR జిల్లా – ఈగల్ అవగాహనా సదస్సు & ఆపరేషన్ త్రిశూల్
తేదీ: 07-10-2026
స్థలం: పాడేరు జిల్లా కేంద్రం
ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా పాడేరు సబ్ డివిజన్ పరిధిలోని 120 మంది GMSKలతో, పాడేరు DSP గారి ఆధ్వర్యంలో “డ్రగ్స్ వద్దు బ్రో” మరియు “BREAK THE SILENCE – CALL EAGLE 1972” కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గౌరవ IGP శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు, SP శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS గారు మరియు SP, EAGLE శ్రీమతి D. స్వరూప రాణి, IPS గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా:

✅ డ్రగ్స్ దుర్వినియోగం, ముఖ్యంగా గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.

✅ మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.

✅ NDPS చట్టాలపై అవగాహన కల్పిస్తూ, మాదక ద్రవ్యాల కేసుల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో వివరించడం జరిగింది.

✅ ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.

✅ “BREAK THE SILENCE – CALL EAGLE 1972” కార్యక్రమం గురించి వివరించి, గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగం లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించడం జరిగింది. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.

✅ ప్రతి గ్రామంలో ఉండే GMSKలు స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉంటారు కాబట్టి, గ్రామాల్లో గంజాయి సాగు, రవాణా, వినియోగం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి EAGLE/పోలీసులకు తెలియజేయాలని సూచించడం జరిగింది.

✅ 1972 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని GMSKలకు సూచించడం జరిగింది.

ర్యాలీ & మానవహారం

అవగాహనా కార్యక్రమం అనంతరం పాడేరు DSP గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, పాడేరు ప్రధాన సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాడేరు DSP గారు, CI పాడేరు గారు, పాడేరు EAGLE సెల్ సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది మరియు 120 మంది GMSKలు పాల్గొన్నారు.

🦅 BREAK THE SILENCE – CALL EAGLE 1972
“మీ ఒక్క సమాచారం… ఎన్నో కుటుంబాన్ని కాపాడవచ్చు!”
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.