EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Tirupati SDPO - S.V.U.Campus UPS
Awareness
OFFICIAL

Tirupathi - Tirupati SDPO - S.V.U.Campus UPS

Conducted: 07 October, 2026 Tirupathi Venue: SV Arts College, బాలాజీ కాలనీ, తిరుపతి EAGLE 150 Attendees
EAGLE – తిరుపతి జిల్లా
“BREAK THE SILENCE” – డ్రగ్స్ అవగాహన కార్యక్రమం
తేదీ: 07-10-2026
స్థలం: SV Arts College, బాలాజీ కాలనీ, తిరుపతి
పోలీస్ స్టేషన్: SV University Police Station
సబ్ డివిజన్: తిరుపతి టౌన్
జిల్లా: తిరుపతి
ఈ రోజు SV Arts College, బాలాజీ కాలనీ, తిరుపతిలో SETWIN మరియు EAGLE Organization, తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో
“BREAK THE SILENCE” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు NDPS Act, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం మరియు వాటి వల్ల కలిగే సామాజిక, ఆరోగ్య మరియు భవిష్యత్ నష్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసలుగా మారకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా విద్య, క్రీడలు, ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టాలని వివరించారు.
అలాగే తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసినప్పుడు భయపడకుండా సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
SETWIN – మోహన్ గారు
EAGLE Team – తిరుపతి
గోవింద స్వామి గారు
కామేశ్వర నాయుడు గారు
గిరిబాబు గారు
కౌటిల్య ఇన్‌స్టిట్యూట్ – N.S. రెడ్డి గారు
SV Arts College Principal – R. కిషన్ గారు

ఈ సందర్భంగా “BREAK THE SILENCE” అనే సందేశం ద్వారా డ్రగ్స్‌పై మౌనం వీడి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

“Drugs వద్దు బ్రో – ఆరోగ్యకరమైన భవిష్యత్తు ముద్దు బ్రో” అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.
EAGLE – Tirupati ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యార్థులు, యువత, విద్యాసంస్థలు మరియు ప్రజల్లో NDPS సంబంధిత అంశాలపై అవగాహన పెంచుతూ, Drug-Free Andhra Pradesh సాధన దిశగా నిరంతరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.