📅 తేదీ: 07.10.2026
📍 స్థలం: బేతపూడి గ్రామం, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి
గౌరవనీయులైన ఈగల్ ఐజిపి శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశానుసారం, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనల మేరకు బేతపూడి గ్రామంలో పల్లెబాట కార్యక్రమాన్ని గుంటూరు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గుంటూరు ఈగల్ ఎస్‌ఐ ఎం. సునీల్ బాబు, ఎన్. రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గారు గ్రామ ప్రజలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ, మాదకద్రవ్యాల వినియోగం లేదా సరఫరాకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతో యువత భవిష్యత్తును కాపాడుతూ మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వివరించారు.
అదేవిధంగా విద్యార్థుల్లో మాదకద్రవ్యాల లేని పరిసరాలలో ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవాలని ఉద్దేశంతో చేపడుతున్న ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఈగల్ క్లబ్స్ తదితర కార్యక్రమాల గురించి గ్రామ పెద్దలకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమం ప్రజలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పెంపొందించడంతో పాటు, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా నిర్వహించబడింది.