BREAK THE SILENCE - CALL EAGLE 1972
లో భాగంగా, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో పి.వి.ఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోలు లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి బారిన పడకుండా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి EAGLE CLUBS ప్రాధాన్యత ,మరియు ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్- ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహర్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ మరియు BREAK THE SILENCE CALL 1972 గూర్చి వివరించడం జరిగింది మరియు ఈగల్ ప్లేడ్జి 06 చేయించడమైనది.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఈగల్ సిబ్బంది మరియు డి అడిక్షన్ సెంటర్ జి.జి.హెచ్ ఒంగోలు వారు మరియు పి.వి.ఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.