EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Sri Potti Sriramulu Nellore - Nellore Rural SDPO - Manubolu
Awareness
OFFICIAL

Sri Potti Sriramulu Nellore - Nellore Rural SDPO - Manubolu

Conducted: 07 October, 2026 Sri Potti Sriramulu Nellore Venue: ప్రభుత్వ జూనియర్ కళాశాల EAGLE 50 Attendees
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS గారు, శ్రీ K.M. మహేశ్వర రాజు, IPS, SP గారు మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP మేడమ్ వారి ఆదేశాల మేరకు, SPSR నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెల్లూరు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో “BREAK the Silence – Call EAGLE 1972” కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యాభ్యాసం, కుటుంబ జీవితం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు మరియు వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించడం జరిగింది.
విద్యార్థులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు, ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను వినియోగించడం, విక్రయించడం, కొనుగోలు చేయడం, రవాణా చేయడం, కలిగి ఉండడం లేదా సాగు చేయడం వంటివి కనిపించినా లేదా వాటికి సంబంధించిన సమాచారం తెలిసినా మౌనంగా ఉండకుండా వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించడం జరిగింది.
అలాగే NDPS చట్టం గురించి వివరించి, మత్తు పదార్థాలను కొనుగోలు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా, కలిగి ఉన్నా లేదా సాగు చేసినా చట్టపరంగా ఎదుర్కోవాల్సిన కేసులు, శిక్షలు మరియు జరిమానాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసైనట్లయితే వారిని De-addiction Centreలో చేర్పించి తగిన చికిత్స మరియు పునరావాసం అందించవచ్చని తెలియజేయడం జరిగింది.
అలాగే మత్తు పదార్థాలపై సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. NDPS చట్టపరమైన కేసుల్లో చిక్కుకున్నట్లయితే వారి విద్య, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వివరించడం జరిగింది.
*“BREAK the Silence”*లో భాగంగా ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణం కోసం బాధ్యతగా వ్యవహరించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు ఈగల్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
EAGLE 1972 – మౌనం వీడండి, సమాచారం అందించండి.
మత్తు పదార్థాలకు నో చెప్పండి – డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసి పనిచేద్దాం.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.