ఆపరేషన్ త్రిశూల్ మరియు BREAK THE SILENCE -CALL 1972 ఈగల్ అవగాహన కార్యక్రమం
ఈరోజు 07-10-2026న, అనంతపురం రూరల్ సబ్-డివిజన్ పరిధిలోని గార్లదిన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్, సింగనమల మండలం, ఇల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గార్లదిన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా మహిళల భద్రత, రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
మాదకద్రవ్యాల నివారణలో భాగంగా “ BREAK THE SILENCE — CALL 1972 ” అనే సందేశంతో, డ్రగ్స్ వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు భయపడకుండా ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని, సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వివరించడం జరిగింది.
అలాగే NDPS Act మరియు EAGLE – Elite Anti-Narcotics Group for Law Enforcement విధులు, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా Operation Safe Campus Zone, Operation Vajra Prahar, Operation Garuda, EAGLE on Trains మరియు Operation Trishul కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.
అనంతరం మొబైల్ ద్వారా E-Pledge కార్యక్రమం నిర్వహించి, పాఠశాల సిబ్బంది, గార్లదిన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు చుట్టుపక్కల ప్రజలు కలిపి 20 మంది చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
BREAK THE SILENCE — CALL 1972
*
నిశ్శబ్దాన్ని వీడండి… 1972కి సమాచారం ఇవ్వండి.