🚫 “ డ్రగ్స్ వద్దు బ్రో ” – మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
BREAK THE SILENCE – CALL 1972
🏫 స్థలం: ZP Urdu High School, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఈరోజు అన్నమయ్య జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో ZP Urdu High School నందు “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వ్యసనాల వల్ల ఆరోగ్యం, కుటుంబం, విద్య మరియు భవిష్యత్తుపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
⚖️ NDPS Act–1985 ప్రకారం మాదకద్రవ్యాల తయారీ, రవాణా, నిల్వ, విక్రయం మరియు వినియోగం చట్టరీత్యా నేరమని , నేర స్వభావం మరియు పరిమాణాన్ని బట్టి కఠినమైన శిక్షలు మరియు జరిమానాలు ఉంటాయని వివరించారు.
🚫 డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు EAGLE టోల్‌ఫ్రీ 1972 లేదా అన్నమయ్య జిల్లా పోలీస్ WhatsApp – 8688830014 కు సమాచారం అందించాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
🤝 డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ, *EAGLE సోషల్ మీడియా వేదికలను Like 👍 | Share 🔄 | Comment 💬 | Subscribe 🔔 చేయాలని విద్యార్థులను కోరారు
eagle.appolice.gov.in వెబ్‌సైట్ ద్వారా 04 మంది విద్యార్థులతో Pledge Certificates జనరేట్ చేయడం జరిగింది,