చిత్తూరు జిల్లా
ఈగల్ అవగాహన కార్యక్రమం మరియు ఆపరేషన్ త్రిసూల్ *
తేదీ: 07-10-2026.
Place: చిత్తూరు పట్టణంలోని PVKN డిగ్రీ కాలేజ్ లోని విద్యార్థులకు
డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం
మరియు ఆపరేషన్ త్రిసూల్
*BREAK THE SILENCE *పై అవగాహన కార్యక్రమం.
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP Sir & శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.
✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.
✅ ప్రతి విద్యార్థి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే BREAK THE SILENCE గురించి ఉపాధ్యాయులు కు వివరించడము జరిగింది.
✅ గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేయడం జరిగింది.
✅ NDPS చట్టాల గురించి వివరిస్తూ, వాటిలో విద్యార్థులు చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెలియజేయడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడం జరిగింది.
✅ ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా EAGLE సెల్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది,మరియు,PVKN డిగ్రీ కాలేజ్ Principal Dr.P.Jeevanjyothi గారు మరియు vice Principal Dr. P.Jayachandrudu garu మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.