తేదీ: 30-09-2026, పోలవరం జిల్లా, AP గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, అడ్డతీగలలో నషా ముక్త్ భారత్ యువ; " బ్రేక్ ద సైలెన్స్" లో భాగంగా *"డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహన కార్యక్రమం " 🦅
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు పోలవరం జిల్లా లోగల అడ్డతీగల నందు ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్, నందు *డ్రగ్స్ వద్దు బ్రో & "బ్రేక్ ద సైలెన్స్" అవగాహన కార్యక్రమం ఈగల్, పోలవరం జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా విద్యార్థులకి Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
✅ ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్ధులు పాల్గొనడమైనది.