TIRUPATI DISTRICT
పల్లె బాటలో ఈగల్ – ఆపరేషన్ త్రిశూల్
తేదీ: 06-10-2026
📍 స్థలం: శ్రీ రామచంద్ర పుష్కరిణి సమీపంలో, బొమ్మగుంట, తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి, తిరుపతి జిల్లా
🌿 పల్లె బాటలో ఈగల్ మరియు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాల్లో భాగంగా, గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లు, యువత మరియు స్థానిక ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
👮♂️ ఈ కార్యక్రమంలో EAGLE తిరుపతి సిబ్బంది W. గోవిందస్వామి, G. కామేశ్వరనాయుడు, కమల్, గిరిబాబు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డ్ వాసు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పూర్ణచంద్రరావు, చంద్రశేఖర్, నాగభూషణం పాల్గొన్నారు.
🚖 ఆటో డ్రైవర్లకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో తెలియకుండానే వాహనాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా పార్సిళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు.
👨🎓 యువతకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై కలిగే తీవ్ర దుష్ప్రభావాల గురించి వివరించారు. చెడు స్నేహాలు, మాదకద్రవ్యాల పట్ల ఆసక్తి మరియు వాటి వినియోగానికి దూరంగా ఉండాలని, క్రీడలు, విద్య మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు.
⚖️ అదేవిధంగా, గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగానికి సంబంధించిన చట్టపరమైన పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
EAGLE – Elite Anti-Narcotics Group for Law Enforcement సంస్థ లక్ష్యాలు, రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలు మరియు అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ ☎️ 1972 గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ఆటో డ్రైవర్లు, యువత మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రజలు మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమాలు, సూచనలు మరియు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందేందుకు EAGLE సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను Subscribe / Follow చేయించారు.
🤝 గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
“డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడండి.”