EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Dr. B R Ambedkar Konaseema - Amalapuram SDPO - Mummidivaram
Awareness
OFFICIAL

Dr. B R Ambedkar Konaseema - Amalapuram SDPO - Mummidivaram

Conducted: 06 October, 2026 Dr. B R Ambedkar Konaseema Venue: ఉష కిరణ్ ITI కాలేజీ EAGLE 150 Attendees
Dr.B.R.Ambedhkar konaseema district
తేదీ: 06-10-2026, ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామంలో *డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం " 🦅

గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir ,శ్రీ K.M మహేశ్వరరాజు,IPS,SP sir & శ్రీమతి D. స్వరూప రాణి,SP,EAGLE గారి ఆదేశాల మేరకు ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామంలో ఉన్న ఉష కిరణ్ ITI కాలేజీ నందు నందు** స్టూడెంట్స్ కు * డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం ఈగల్ సెల్, Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

✅ ఈ సందర్భంగా స్టూడెంట్స్ కు Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.

✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

✅ NDPS చట్టం కింద కేసులలో ఇరుక్కుంటే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడమైనది.

✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావం వివరించడమైనది.

✅ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం కోసం స్టూడెంట్స్ కు చైతన్యం కల్పించడమైనది.

✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.

✅ NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.

✅ స్టూడెంట్స్ కు సైబర్ క్రైమ్ ను గురించి కూడా అవగాహన కల్పించడమైనది ,చివర్లో స్టూడెంట్స్ చే ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ వద్దు బ్రో నినాదం చేయించడమైనది.

✅ ఈ కార్యక్రమంలో ఈగల్ సిబ్బంది, ప్రిన్సిపాల్ గారు , సైకియాటిక్ కౌన్సిలర్ మరియు అధ్యాపకులు మరియు స్టూడెంట్స్ పాల్గొనడమైనది.

నమస్కారం సార్..
ఈగల్ సెల్,
Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.