EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor
Awareness
OFFICIAL

Chittoor

Conducted: 06 October, 2026 Chittoor Venue: అరుణాచల జూనియర్ & డిగ్రీ కాలేజ్ EAGLE 200 Attendees
చిత్తూరులో “డ్రగ్స్ వద్దు బ్రో” – “BREAK THE SILENCE” అవగాహన కార్యక్రమం
చిత్తూరు పట్టణంలోని మిట్టూరులో గల అరుణాచల జూనియర్ & డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” మరియు **“BREAK THE SILENCE”**పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వర రాజు, IPS, SP మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రగ్స్ దుర్వినియోగం, గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, శారీరక–మానసిక ఆరోగ్యంపై ప్రభావం, కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అలాగే NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల గురించి వివరించి, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. “BREAK THE SILENCE” కార్యక్రమం గురించి ఉపాధ్యాయులకు వివరించారు.
గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు EAGLE టోల్‌ఫ్రీ నంబర్ – 1972కు సమాచారం అందించాలని, సమాచారదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా EAGLE సెల్ సిబ్బంది, అరుణాచల జూనియర్ & డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ Jaganadh Reddy గారు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
📞 డ్రగ్స్ వద్దు – ఆరోగ్యం ముద్దు | Call: 1972
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.