అన్నమయ్య జిల్లాలో “డ్రగ్స్ వద్దు బ్రో” – మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
📅 తేదీ: 06-10-2026
🏫 స్థలం: పెంచల్ రెడ్డి CBSE స్కూల్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా
“BREAK THE SILENCE – CALL 1972”
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో పెంచల్ రెడ్డి CBSE స్కూల్‌లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వ్యసనాల వల్ల ఆరోగ్యం, కుటుంబం, విద్య మరియు భవిష్యత్తుపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
NDPS Act–1985 ప్రకారం మాదకద్రవ్యాల తయారీ, రవాణా, నిల్వ, విక్రయం మరియు వినియోగం చట్టరీత్యా నేరమని, నేర స్వభావం మరియు పరిమాణాన్ని బట్టి కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించబడతాయని విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తూ, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు EAGLE టోల్‌ఫ్రీ నంబర్ – 1972 లేదా అన్నమయ్య జిల్లా పోలీస్ WhatsApp నంబర్ – 8688830014కు సమాచారం అందించాలని, సమాచారదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ, EAGLE సోషల్ మీడియా వేదికలను Like 👍 | Share 🔄 | Comment 💬 | Subscribe 🔔 చేయాలని విద్యార్థులను కోరారు.