ఏలూరు EAGLE సెల్,
తేదీ: 05-10-2026,
ఏలూరు త్రీ టౌన్ పీస్ లిమిట్స్.
విద్యార్థుల్లో డ్రగ్స్ వ్యతిరేక చైతన్యం – C.R. Reddy Engineering Collegeలో EAGLE అవగాహన కార్యక్రమం.
👉ఏలూరు EAGLE డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో C.R. Reddy Engineering College నందు విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ఏలూరు DSP శ్రీ శ్రావణ్ కుమార్ గారు అధ్యక్షత వహించడం అయినది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు:
* Golden Crescent ప్రాంతం మరియు అక్కడి నుంచి జరిగే మాదకద్రవ్యాల అక్రమ రవాణా మార్గాల గురించి, అలాగే డ్రగ్స్ అక్రమ రవాణా అంతర్జాతీయ నేర కార్యకలాపాలకు ఎలా అనుసంధానమవుతుందనే విషయాన్ని ఉదాహరణలతో వివరించడం అయినది.
* నార్కో టెర్రరిజం అనగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమకూరే నిధులు లేదా డ్రగ్స్ నెట్‌వర్క్‌లను ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా ఉపయోగించే విధానం గురించి వివరించడం అయినది.
* డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా వచ్చే నిధులు ఉగ్రవాద సంస్థలకు చేరడం, ఆ నిధులను ఆయుధాలు, నియామకాలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే పరిణామాలను ఉదాహరణలతో వివరించడం అయినది.
- మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక మరియు సామాజిక దుష్ప్రభావాల గురించి వివరించడం అయినది.
- NDPS Act–1985 ప్రకారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, నిల్వ, కలిగి ఉండటం మరియు వినియోగానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, శిక్షల గురించి వివరించడం అయినది.
- డ్రగ్స్ వినియోగం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడం, ఆరోగ్యం క్షీణించడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం మరియు భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉందని వివరించడం అయినది.
- స్నేహితుల ఒత్తిడి, సరదా కోసం లేదా ప్రయోగాత్మకంగా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించి, క్రమంగా వ్యసనానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించడం అయినది.
- డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడినట్లయితే అరెస్ట్, కేసులు, జైలు శిక్ష మరియు జరిమానాలు వంటి తీవ్ర చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడం అయినది.
- విద్యార్థులు డ్రగ్స్‌కు “NO” చెప్పడంతో పాటు, తమ స్నేహితులను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించడం అయినది.
- “Break the Silence – Call 1972” అనే సందేశం ద్వారా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి తెలిసినప్పుడు EAGLE 1972 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించి, మౌనం వీడి డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించడం అయినది.
- విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి పెట్టాలని సూచించడం అయినది.
- “Drugs Vaddu Bro – Say No to Drugs” అనే సందేశంతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అవగాహన కల్పించడం అయినది.