EAGLE అవగాహన కార్యక్రమం – ఎన్టీఆర్ జిల్లా
తేదీ: 05-10-2026.
📍 వేదిక:
S.R.K Institute Technology, Enikepadu, Vijayawada
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE , శ్రీ M. మహేశ్వర్ రాజు IPS Eagle SP(Ops), శ్రీమతి G స్వరూపారాణి SP(ADMIN) ఆదేశాలు మేరకు, శ్రీ CI M. రవీంద్ర గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.
👉కాలేజ్ విద్యార్థులకు
DRUG ABUSE మరియు “*BREAK THE SILENCE” అంశాలపై
EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది* .
👉ఈ కార్యక్రమానికి
Dr. G. Samaram
(Chairman, Indian Red cross Society, Ntr District )
Eagle CI శ్రీ M. Ravindra గారు, Sri Chinni గారు (NSS), ఈగల్ సిబ్బంది, మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్దులు(500) పాల్గొన్నారు.
*️⃣ఈ కార్యక్రమంలో
డాక్టర్ శ్రీ సమరం గారు మాట్లాడుతూ
DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
*️⃣ఈగల్ CI శ్రీ M. రవీంద్ర గారు మాట్లాడుతూ
🦅 NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.
🚫 మాదక ద్రవ్యాలపై అవగాహనవిద్యార్థులకు NDPS Act – Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 గురించి వివరంగా అవగాహన కల్పించడం జరిగింది. మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలను వివరించారు.
🔇 BREAK THE SILENCE
డ్రగ్స్‌కు సంబంధించిన సమస్యలను దాచిపెట్టడం లేదా మౌనంగా ఉండటం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విద్యార్థులకు వివరించారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమస్య ఎదురైతే మౌనం వీడాలి – మాట్లాడాలి, సహాయం కోరాలి, సరైన మార్గదర్శకత్వం పొందాలి.
తమ స్నేహితులు లేదా పరిచయస్తులు డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్నట్లు లేదా బానిసలవుతున్నట్లు గుర్తించినప్పుడు, వారిని నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడి, అవసరమైన సహాయం అందించే దిశగా ముందుకు రావాలని సూచించారు.
🇮🇳 Narco-Terrorism పై అవగాహన
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమాజానికి, ముఖ్యంగా యువతకు కలుగుతున్న నష్టంతో పాటు, Narco-Terrorism వల్ల దేశ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది.
విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా, తమ స్నేహితులు లేదా పరిచయస్తులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నట్లు గుర్తించినప్పుడు వారికి అవగాహన కల్పించి, అవసరమైన సహాయం అందించే విధంగా ముందుకు రావాలని సూచించారు. 🤝
📞 EAGLE Toll-Free Number – 1972
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు EAGLE Toll-Free Number – 1972కు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు.
🎯 యువతకు ప్రత్యేక సందేశం
“ డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.”
“యువతే దేశ భవిష్యత్తు – డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి.”
*️⃣ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచడంతో పాటు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా పనిచేయాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రతిజ్ఞ చేయించారు.
నమస్కారం సార్,
ఎన్టీఆర్ జిల్లా ఈగల్ సెల్ 🙏