EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Guntur - West Sub Division - Arundalpet
Awareness
OFFICIAL

Guntur - West Sub Division - Arundalpet

Conducted: 30 October, 2026 Guntur Venue: DPO GUNTUR EAGLE 110 Attendees
🦅గుంటూరు ఈగల్ సెల్🦅
📅 తేదీ: 30-10-2026
⏰ సమయం: సాయంత్రం 4:00 గంటలకు
📍 స్థలం: జిల్లా పోలీస్ కార్యాలయం, గుంటూరు.
🔹సబ్ డివిజన్: వెస్ట్ సబ్ డివిజన్
🔹జిల్లా: గుంటూరు.
👮‍♂️👮‍♀️*నూతన పోలీస్ కానిస్టేబుళ్లకు మాదకద్రవ్యాల నియంత్రణపై ఈగల్ సెల్ అవగాహన*
🔸డ్రగ్స్‌పై పోరాటంలో పోలీసుల పాత్ర కీలకం – గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై ఎం. సునీల్ బాబు
🔸*‘డ్రగ్స్ వద్దు బ్రో – బ్రేక్ ది సైలెన్స్’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.
▪️గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన 90 మంది పురుష, 20 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, మొత్తం 110 మందితో గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై శ్రీ ఎం. సునీల్ బాబు ఇంటరాక్టివ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
▪️ఈ సందర్భంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో – బ్రేక్ ది సైలెన్స్’ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంలో పోలీసుల బాధ్యతను తెలియజేశారు.
▪️అలాగే ఏపీ ఈగల్ సంస్థ యొక్క ఏర్పాటు, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్‌పై సాగిస్తున్న పోరాటం గురించి వివరించడం జరిగింది.
▪️ముఖ్యంగా ఏపీ ఈగల్ సామాజిక మాధ్యమాల ద్వారా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే విధానంతో పాటు, ఏపీ ఈగల్ అధికారిక వెబ్‌సైట్ eagle.appolice.gov.in లోని అనానిమస్ రిపోర్టింగ్ (Anonymous Reporting) సదుపాయం ద్వారా తమ వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే విధానంపై ప్రత్యేక అవగాహన కల్పించడం జరిగింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
▪️మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పోలీస్ సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని, ‘బ్రేక్ ది సైలెన్స్ – కాల్ 1972’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.