EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kakinada - Kakinada SDPO - Kakinada I Town
Awareness
OFFICIAL

Kakinada - Kakinada SDPO - Kakinada I Town

Conducted: 05 October, 2026 Kakinada Venue: శ్రీ వికాస్ జూనియర్ కాలేజీ,కాకినాడ. EAGLE 50 Attendees
EAGLE అవగాహన కార్యక్రమం – కాకినాడ జిల్లా.
తేదీ: 05-10-2026
📍 వేదిక: శ్రీ వికాస్ జూనియర్ కాలేజీ,కాకినాడ.
III టౌన్ P.S.
ఈ రోజు కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు BREAK THE SILENCE అంశంపై EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవికృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు EAGLE సెల్, కాకినాడ జిల్లా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాలు మరియు ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై కలిగే ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. NDPS Act–1985 గురించి, మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలను వివరించారు.

BREAK THE SILENCEలో భాగంగా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా బాధ్యతగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, తమ స్నేహితులు లేదా పరిచయస్తులు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.

అలాగే EAGLE చేపడుతున్న చైతన్యం, గరుడ, సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్, వజ్రప్రహార్ మరియు ఇతర డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు.

“డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.”

ఈ కార్యక్రమంలో కాకినాడ EAGLE సిబ్బంది,కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది, సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

నమస్కారం సార్,
CI, EAGLE కాకినాడ.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.