BREAK THE SILENCE – CALL 1972
జిల్లా: అనకాపల్లి జిల్లా
తేదీ: 29.10.2026
సబ్ డివిజన్: నర్సీపట్నం
పోలీస్ స్టేషన్: ఎస్. రాయవరం పోలీస్ స్టేషన్
కార్యక్రమ స్థలం: అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, సర్వసిద్ధి
పాల్గొన్నవారు: 70 మంది గ్రామ ప్రజలు
కార్యక్రమ వివరాలు:
తేదీ 29.10.2026న 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు అందిన సమాచారం మేరకు, CI కళ్యాణి మేడం గారి ఆదేశాలపై అనకాపల్లి జిల్లా, ఎస్. రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వసిద్ధి గ్రామంలో స్థానిక పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, సెక్రటరీ, మహిళా పోలీస్ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
👉 ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది.
👉 డ్రగ్స్ వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.
👉 యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
👉 తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి సరైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా వారి భవిష్యత్తును కాపాడాలని సూచించడం జరిగింది.
👉 తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
👉“BREAK THE SILENCE” నినాదంతో మాదకద్రవ్యాలపై మౌనం వీడి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
👉 డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను తెలియజేయడానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.
ముఖ్య నినాదం:
🚫 డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో!