గుంటూరు జిల్లా ఈగల్ సెల్ 🦅
📅 తేదీ: 29-10-2026
⏰ సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
🔹 సబ్ డివిజన్: గుంటూరు నార్త్
📍 జిల్లా: గుంటూరు
🏫 వేదిక: వి.జె.పి. అండ్ డి.ఎల్.బి. డిగ్రీ కళాశాల, మంగళగిరి.
🔰 విద్యార్థులు పీర్ ప్రెషర్‌కు లోనుకాకుండా డ్రగ్స్‌కు ధైర్యంగా ‘నో’ చెప్పాలి – గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై ఎం. సునీల్ బాబు
🔸 ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆర్కే రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఆపరేషన్స్ ఎస్పీ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారు మరియు ఈగల్ అడ్మిన్ ఎస్పీ శ్రీమతి స్వరూప రాణి గారి సూచనలతో మంగళగిరిలోని వి.జె.పి. అండ్ డి.ఎల్.బి. డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బ్రేక్ ది సైలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
▪️ఈ సందర్భంగా ఈగల్ సెల్ ఎస్సై ఎం. సునీల్ బాబు గారు మాట్లాడుతూ, విద్యార్థులు స్నేహితుల ఒత్తిడికి (Peer Pressure) లోనుకాకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు ధైర్యంగా ‘నో’ చెప్పాలని సూచించారు.
▪️ నార్కో టెర్రరిజం, గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్ ప్రాంతాల నుంచి జరిగే మాదకద్రవ్యాల అక్రమ రవాణా వల్ల యువతకు, సమాజానికి, దేశ భద్రతకు కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
▪️మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే *ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972*కు తెలియజేయాలని కోరారు.
▪️అలాగే సోషల్ మీడియా Instagram, Facebook, YouTube, X – @eagleap1972 / @eagleap1972gnt లేదా https://eagle.appolice.gov.in ద్వారా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండానే సమాచారం అందించవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
▪️ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎక్సైజ్ శాఖ సీఐ జి.వీరాంజనేయులు గారు, ఎస్సై ఏ.పద్మజ గారు, గుంటూరు ఈగల్ సెల్ ఎస్సైలు ఎం. సునీల్ బాబు, రాజశేఖర్, ఈగల్ సిబ్బంది మరియు కాలేజీ ఏవో రవీంద్ర గారు, నవజీవన్ బాల భవన్ ప్రోగ్రామ్ మేనేజర్ జి.శేఖర్ బాబు గారు పాల్గొన్నారు.