నంద్యాల ఈగల్ సెల్.
నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 5K, 10K మారథాన్ నిర్వహణ.
Sub-division - NANDYAL
PS limits - Nandyal III town UPS
Place - Collector office, Nandyal.
Participated - 500
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా 29.10.2026వ తేదీన 5 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల మారథాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ కుమారి గనియా, IAS మరియు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ సోరాన్, IPS మరియు కుమారి మనీషా IAS, సబ్ కలెక్టర్ మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, నంద్యాల జిల్లా అధికారులు జిల్లా పోలీసు సిబ్బంది , ఈగల్ సిబ్బంది,కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది, స్పోర్ట్స్ అకాడమీలోని స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ మారథాన్ కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు. ఈ మారథాన్ ద్వారా మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం, యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం మరియు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.
ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, చదువు, క్రీడలు, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని ఏదైనా గంజాయి ఇతర మత్తు పదార్దాల సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని మరియు ఈగల్ వెబ్ సైట్ నందు anonymous report ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత నంద్యాల జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సందేశమిచ్చి అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.