EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Prakasam - Darsi SDPO - Medarametla
Awareness
OFFICIAL

Prakasam - Darsi SDPO - Medarametla

Conducted: 29 October, 2026 Prakasam Venue: Medarametla Government Zilla Parishad High School EAGLE 150 Attendees
ప్రకాశం జిల్లా ఈగల్ సెల్
BREAK THE SILENCE – CALL 1972
తేదీ: 29.10.2026
జిల్లా:- ప్రకాశం
సబ్ డివిజన్: దర్శి
పోలీస్ స్టేషన్: మేదరమెట్ల
కార్యక్రమ స్థలం: మేదరమెట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు: 150 మంది మరియు స్కూల్ హెడ్మాస్టర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కార్యక్రమ వివరాలు:
ఈ రోజు “డ్రగ్స్ వద్దు బ్రో – BREAK THE SILENCE, CALL 1972” కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా EAGLE టీం ఆధ్వర్యంలో మేదరమెట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై వాటి ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు మౌనం వీడి, 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగాఉంచబడతాయని అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
ముఖ్య నినాదం:
🚫 డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.