అన్నమయ్య జిల్లా, మదనపల్లి పట్టణంలోని సర్వోదయ డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌ను EAGLE సెల్ సిబ్బంది సందర్శించారు.
ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, వ్యసనాల స్వరూపం, అందుతున్న వైద్య, కౌన్సెలింగ్ మరియు పునరావాస సేవలపై వివరాలు సేకరించారు. సెంటర్ వైద్యులు డా. A.V. సుబ్బారెడ్డి గారితో మాట్లాడగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో మద్యపాన వ్యసనానికి సంబంధించిన వారే ఉన్నారని, గంజాయి వ్యసనానికి సంబంధించిన పేషెంట్లు ప్రస్తుతం లేరని తెలిపారు.
అలాగే సెంటర్‌లో అమలవుతున్న కౌన్సెలింగ్, మానసిక పరిరక్షణ, యోగా థెరపీ, వైద్య చికిత్స మరియు పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది సేవాభావం మరియు పేషెంట్ల పట్ల చూపుతున్న శ్రద్ధ సంతృప్తికరంగా ఉన్నట్లు గమనించారు.
ఈ కార్యక్రమంలో EAGLE Cell సిబ్బంది, సెంటర్ డాక్టర్, కౌన్సెలర్, సైకాలజిస్ట్, నర్స్ మరియు ఇతర సిబ్బందితో మాట్లాడి డీ-అడిక్షన్ చికిత్స మరియు పునరావాస విధానాలపై వివరాలు సేకరించారు.