టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్
📅 తేదీ: 28-10-2026
📍 జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా
📍 సబ్ డివిజన్: పుట్టపర్తి
📍 ప్రదేశం: పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిసర ప్రాంతం
ఐజీపీ ఈగల్ శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ శ్రీ మహేశ్వర్ రాజు, IPS గారు మరియు ఈగల్ ఎస్పీ శ్రీమతి స్వరూపారాణి, IPS గారి సూచనల ప్రకారం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఫిరోజా బేగం గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ర్యాలీలో ఈగల్ సెల్ తరఫున పాల్గొనడం జరిగింది.
📍 పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలోని పుట్టపర్తి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిపి సుమారు 150 మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజలకు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి పొగాకు వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించి, పొగాకు వినియోగానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా, ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధిత సోషల్ మీడియా వేదికలను సబ్‌స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సహించడం జరిగింది.
యువతను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచడం, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. సమర్పించడమైనది