అనంతపురం అర్బన్‌లో సర్ సి.వి. రామన్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాలపై EAGLE అవగాహన కార్యక్రమం
05-10-2026న అనంతపురం అర్బన్ సబ్‌డివిజన్ పరిధిలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఉన్న సర్ సి.వి. రామన్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా “BREAK THE SILENCE – CALL 1972” ప్రధాన సందేశంతో, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే మౌనం వీడి EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.
అలాగే NDPS చట్టం కింద మాదకద్రవ్యాలను కలిగి ఉండటం, వినియోగించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి చర్యలకు ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, విద్యకు ఆటంకం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరియు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు.
యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండి, చెడు అలవాట్లకు లోనుకాకుండా తమ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి సారించాలని, సమాజ భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని సూచించారు.
BREAK THE SILENCE – CALL 1972 📞
నిశ్శబ్దాన్ని వీడండి… డ్రగ్స్‌కు NO చెప్పండి.