🦅 EAGLE CELL – అన్నమయ్య జిల్లా
📅 తేదీ : 28-10-2026
📍 స్థలం : DPO, మదనపల్లి
👥 పాల్గొన్న వారు : సుమారు 500 మంది
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మదనపల్లి DPOలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో EAGLE CELL – అన్నమయ్య జిల్లా పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించింది.
ఈ సందర్భంగా “ BREAK THE SILENCE – CALL 1972”, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, అక్రమ రవాణా మరియు వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే డ్రగ్ డిటెక్షన్ కిట్స్, గంజాయి గుర్తింపు పరీక్షా కిట్స్ వినియోగం, ప్రాముఖ్యతను వివరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.