EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur III Town
Awareness
OFFICIAL

Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur III Town

Conducted: 28 October, 2026 Ananthapuram Venue: Vocational Junior College, Anantapur Town EAGLE
EAGLE CELL – అనంతపురం జిల్లా
📢 EAGLE–AP VISION DOCUMENT ON NARCOTICS CONTROL (2026–29)
🏆 యువత క్రీడల్లో భాగస్వామ్యం – మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం
📍 వేదిక: ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, అనంతపురం టౌన్
🚔 పోలీస్ స్టేషన్ : 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి, అనంతపురం అర్బన్ సబ్ డివిజన్
👥 పాల్గొన్నవారు : సుమారు 200 మంది విద్యార్థులు
📅 తేదీ: 28-10-2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సేవల శాఖ మరియు EAGLE Teams–AP సంయుక్తంగా చేపట్టిన “EAGLE–AP Vision Document on Narcotics Control 2026–29” కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, అనంతపురంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణ, EAGLE విభాగం లక్ష్యాలు, విధులు, NDPS చట్టం మరియు క్రీడల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
🎯 కార్యక్రమంలోని ముఖ్యాంశాలు:
🔹 EAGLE లక్ష్యాలు – విధులు : మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంలో EAGLE బృందం పాత్ర, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాల్సిన అవసరాన్ని వివరించడం జరిగింది.
⚖️ NDPS చట్టంపై అవగాహన : మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు, చట్టపరమైన పరిణామాలు, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది.
🏐 క్రీడలే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం : వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గింపు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని వివరించడం జరిగింది.
🏅 క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు: రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, అర్హతలు మరియు వర్తించే నిబంధనల ప్రకారం క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.
📞 BREAK THE SILENCE – CALL EAGLE 1972 : మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని, సమాచారదాత వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేయడం జరిగింది.
🛡️ ఆపరేషన్ త్రిశూల్ : మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టే చర్యలు, యువత మరియు సమాజ భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
🤝 ఈ కార్యక్రమంలో ANSET CEO గారు, ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, కళాశాల సిబ్బంది మరియు EAGLE Cell, అనంతపురం బృందం పాల్గొన్నారు. సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
🌿 సందేశం:
“ డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో!”
🏆 క్రీడలను ఎంచుకోండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోండి – మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.