EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town
Awareness
OFFICIAL

Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town

Conducted: 28 October, 2026 Vizianagaram Venue: RTC Complex, Vizianagaram EAGLE 127 Attendees
జిల్లా : విజయనగరం
సబ్ డివిజన్ : విజయనగరం
పోలీస్ స్టేషన్ :వన్ టౌన్, విజయనగరం
వేదిక : RTC కాంప్లెక్స్, విజయనగరం
𝔹𝕣𝕖𝕒𝕜 𝕥𝕙𝕖 𝕤𝕚𝕝𝕖𝕟𝕔𝕖 𝕔𝕒𝕝𝕝 𝔼𝕒𝕘𝕝𝕖-𝟙𝟡𝟟𝟚 కార్యక్రమం లో భాగంగా
విజయనగరం RTC కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం
1. విజయనగరం RTC కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు అనుమానాస్పద బ్యాగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడం.
2. ఒక వ్యక్తి తన బ్యాగును ఒకచోట ఉంచి, మరొకచోట కూర్చున్నట్లయితే అటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించడం.
3. గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన బ్యాగులు లేదా వస్తువులను అనుమతి లేకుండా తెరవడం, తాకడం లేదా తరలించడం చేయకూడదని తెలియజేయడం.
4. అనుమానాస్పద బ్యాగులు కనిపించినప్పుడు వెంటనే RTC సిబ్బందికి లేదా సమీప పోలీసులకు సమాచారం అందించాలని సూచించడం.
5. బ్యాగుల యజమానుల గురించి స్వయంగా విచారణ చేయడానికి లేదా అనుమానిత వ్యక్తులను ఎదుర్కోవడానికి ప్రయత్నించకుండా, అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలియజేయడం.
6. ప్రయాణికులు తమ వస్తువులను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకోవాలని, ఇతరుల బ్యాగులను తమవిగా తీసుకెళ్లకూడదని అవగాహన కల్పించడం.
7. బస్సు ప్రయాణ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినప్పుడు భయపడకుండా, అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించడం.
8. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అనుమానాస్పద కార్యకలాపాలు తదితర అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు మరియు ఈగల్ టీం కు సహకరించాలని తెలియజేయడం.
9. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు EAGLE ఆంధ్రప్రదేశ్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని అవగాహన కల్పించడం.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.