BREAK THE SILENCE – CALL 1972
తేదీ: 28.10.2026
జిల్లా:- ప్రకాశం
సబ్ డివిజన్: ఒంగోలు
పోలీస్ స్టేషన్: మద్దిపాడు
కార్యక్రమ స్థలం: మద్దిపాడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు: 75 మంది మరియు ప్రిన్సిపాల్గారు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కార్యక్రమ వివరాలు:
ఈ రోజు “డ్రగ్స్ వద్దు బ్రో – BREAK THE SILENCE, CALL 1972” కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా జిల్లా EAGLE టీం ఆధ్వర్యంలో మద్దిపాడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై వాటి ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు మౌనం వీడి, 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగాఉంచబడతాయని అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.