తిరుపతి జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ సిబ్బంది
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కాండిల్ ర్యాలీ నిర్వహణ.
- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో కాండిల్ ర్యాలీ.
- పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించిన పోలీస్ అధికారులు, సిబ్బంది.మరియు ఈగల్ సిబ్బంది
- అమరవీరుల త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ విధి నిర్వహణకు అంకితమవ్వాలనే సందేశం.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించు కుంటూ,మంగళవారం సాయంత్రం పోలీస్ అధికారులు, సిబ్బంది పేరేడ్ మైదానము నందు కాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల ధైర్యసాహసాలు, త్యాగనిరతి, విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన అంకితభావాన్ని స్మరించుకున్నారు. దేశ సేవలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు, భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.