EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur I Town
Awareness
OFFICIAL

Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur I Town

Conducted: 27 October, 2026 Ananthapuram Venue: AR OFFICE, EAGLE 250 Attendees
EAGLE CELL – అనంతపురం జిల్లా
విషయం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమంలో “ BREAK THE SILENCE – CALL 1972”, ఆపరేషన్ త్రిశూల్ మరియు డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
జిల్లా: అనంతపురం
తేదీ: 27-10-2026
స్థలం: AR OFFICE, అనంతపురం పట్టణం
పాల్గొన్న వారి సంఖ్య: 250 మంది
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం పట్టణంలోని AR OFFICEలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో EAGLE CELL, అనంతపురం జిల్లా బృందం పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా EAGLE బృందం “ BREAK THE SILENCE – CALL 1972” నినాదం యొక్క ప్రాముఖ్యత, EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972, ఆపరేషన్ త్రిశూల్ లక్ష్యాలు , మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం మరియు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించింది. అలాగే, మాదకద్రవ్యాల సంబంధిత కేస్ స్టడీ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించింది.
అదేవిధంగా, డ్రగ్ డిటెక్షన్ కిట్స్, గంజాయి గుర్తింపు పరీక్షా కిట్స్ వినియోగం, వాటి ప్రాముఖ్యత గురించి వివరించి , మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పొందారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.