డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం తానెలంక గ్రామంలోని APSWRS (Girls) Schoolలో EAGLE సెల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు Operation Chaitanya, Operation Garuda, Operation Safe Campus Zone, Joint Train Operations మరియు EAGLE కార్యక్రమాల గురించి వివరించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అలాగే NDPS చట్టం కింద కేసుల్లో చిక్కుకుంటే ఎదురయ్యే పరిణామాలు, శిక్షల గురించి వివరించారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. విద్యార్థినులకు సైబర్ క్రైమ్పై కూడా అవగాహన కల్పించారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థినులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదం చేయించారు. ఈ కార్యక్రమంలో EAGLE సిబ్బంది, ప్రిన్సిపాల్, సైకియాట్రిక్ కౌన్సిలర్, డీ-అడిక్షన్ సెంటర్ సిబ్బంది, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.