EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Guntur - West Sub Division - Arundalpet
Awareness
OFFICIAL

Guntur - West Sub Division - Arundalpet

Conducted: 27 October, 2026 Guntur Venue: Government Backward Classes College Boys' Hostel EAGLE 100 Attendees
🦅 గుంటూరు జిల్లా ఈగల్ సెల్ 🦅
📅తేదీ: 27-10-2026
🔹సమయం: 7 PM
🔹జిల్లా:* గుంటూరు
🔹సబ్ డివిజన్: గుంటూరు వెస్ట్
🔹పోలీస్ స్టేషన్: అరండల్‌పేట
🔹ప్రాంతం: బ్రాడీపేట, 1/13వ లైన్, గుంటూరు
వేదిక: ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలుర వసతిగృహం (గుంటూరు–పశ్చిమ)
🔹పాల్గొన్న విద్యార్థులు: 100 మంది
🔰 ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై ఈగల్ సెల్ అవగాహన కార్యక్రమం
🔰 మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి – ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి
🔰 55 మంది విద్యార్థులతో ఈగల్ ప్రతిజ్ఞ Eసర్టిఫికెట్ల చేపించడమైంది
🔸గుంటూరు జిల్లా వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో గల బ్రాడీపేట 1/13వ లైన్‌లోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలుర వసతిగృహం (గుంటూరు–పశ్చిమ) నందు ఈరోజు అనగా 27-10-2026 సాయంత్రం 7:00 గంటలకు గుంటూరు జిల్లా ఈగల్ సెల్ మరియు బీసీ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 55 మంది విద్యార్థులకు "BREAK THE SILENCE – CALL 1972" మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఏపీ ఈగల్ చీఫ్ ఐజిపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఆపరేషన్స్ ఎస్పీ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారు మరియు ఈగల్ అడ్మిన్ ఎస్పీ శ్రీమతి స్వరూప రాణి గారి సూచనల తో విద్యార్థులకు బ్రేక్ ది సైలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది
🔸ఈ సందర్భంగా ఈగల్ సెల్ ఎస్సై శ్రీ ఎం. సునీల్ బాబు గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
🔸నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు విద్య, కుటుంబ జీవితం, వ్యక్తిగత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.
🔸మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈగల్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న *ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ వజ్రప్రహార్ వంటి ప్రత్యేక కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలను విద్యార్థులకు వివరించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు మరియు యువత ఎక్కువగా ఉండే ప్రాంతాలను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
🔸"BREAK THE SILENCE – CALL 1972" కార్యక్రమంలో భాగంగా గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే భయపడకుండా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
🔸ఈ కార్యక్రమంలో భాగంగా 55 మంది విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ ప్రతిజ్ఞ (EAGLE PLEDGE) చేయించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో ఈగల్ ప్రతిజ్ఞకు సంబంధించిన సర్టిఫికెట్లను జనరేట్ చేయించడం జరిగింది.
🔸చివరగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా, తమ తోటి విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తూ మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి కె. మయూరి గారు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి భవాని గారు, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ సాగర్ గారు, గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై శ్రీ ఎం. సునీల్ బాబు గారు, ఎస్సై శ్రీ రాజశేఖర్ గారు మరియు ఈగల్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.