తేదీ: 27-10-2026
📍 జిల్లా : YSR కడప జిల్లా
🏢 సబ్ డివిజన్ : కడప
👮 పోలీస్ స్టేషన్ :
కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం :మునిసిపల్ కార్పొరేషన్ క్రీడా మైదానము, కడప
👥 అటెండెన్స్ : 120 మంది క్రీడాకారులు
🚫💊 “ BREAK THE SILENCE – CALL 1972 ”
గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ, ఐ.పీ.ఎస్ గారి ఉత్తర్వుల మేరకు, శ్రీ మహేశ్వర రాజు గారు IPS, SP ఈగల్, & శ్రీమతి స్వరూపా రాణి గారు SP ఈగల్ అడ్మిన్ వారి సూచనల మేరకు కడప చిన్న చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో మనోమయ స్కూల్ యందు విద్యార్థిని విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల జరిగే దుష్పరిణామాల గురించి అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది
👉 ఈగల్ అధికారులు కబడ్డీ ఆడుచున్న క్రీడాకారులను ఉద్దేశించి
“మాదక ద్రవ్యాలు వ్యక్తిని కాదు, కుటుంబాన్ని కాదు, సమాజాన్నే నాశనం చేస్తాయి. డ్రగ్-ఫ్రీ కడప జిల్లా నిర్మాణంలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
🔷 కార్యక్రమంలో చర్చించిన ముఖ్య అంశాలు:
1️⃣ ఈగల్ బృందం అవగాహన – డ్రగ్స్‌కు చెక్ పెట్టడానికి ప్రత్యేక దళం:
👉 రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దళం EAGLE (Elite Anti-Narcotics Group for Law Enforcement) గురించి విద్యార్థులకు వివరించారు.
డ్రగ్స్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగం — ఇవన్నీ NDPS చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలు.
వీటికి దీర్ఘకాల కారాగార శిక్షలు, భారీ జరిమానాలు ఉండబోతాయని ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు.
2️⃣ “1972” టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ – మీ సమాచారం, మీ పేరు గోప్యం
మీ ప్రాంతంలో
▪️ గంజాయి విక్రయం
▪️ డ్రగ్స్ వినియోగం
▪️ అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలు
గమనిస్తే వెంటనే 1972 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈగల్ బృందం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల గురించి వివరించడం జరిగింది
3️⃣ ఆపరేషన్ – “Safe Campus Zone” విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల చుట్టూ సురక్షిత వాతావరణం కోసం:
కళాశాల/పాఠశాలల పరిధిలోని 500 మీటర్లలో పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధం.
బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తులు విక్రయిస్తే COTPA చట్టం ప్రకారం షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
4️⃣ సైబర్ నేరాలపై అప్రమత్తం
ప్రజలకు సూచనలు:
తెలియని లింకులు, ఫ్రాడ్ మెసేజ్‌లు క్లిక్ చేయవద్దు.
OTP, బ్యాంకు సమాచారం, PAN వివరాలు పంచుకోవద్దు.
సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులతో చాట్ చేయడం, ఫోటోలు షేర్ చేయడం ప్రమాదకరం
👉 ఈ కార్యక్రమంలో 120 క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, డ్రగ్స్ వ్యతిరేకంగా తమ సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.