EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Ananthapuram - Ananthapuramu Rural - Putlur
Awareness
OFFICIAL

Ananthapuram - Ananthapuramu Rural - Putlur

Conducted: 27 October, 2026 Ananthapuram Venue: PVKK Engineering College, Kattakindapalli Village EAGLE
BREAK THE SILENCE -CALL 1972 AND OPERATION TRISHOOL PROGRAME
తేదీ: 27-10-2026
ప్రదేశం: పి.వి.కే.కే, ఇంజనీరింగ్ కాలేజ్ కట్టకిందపల్లి గ్రామం అనంతపురం పట్టణం
పోలీస్ స్టేషన్: అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి
సబ్ డివిజన్: అనంతపుర రూరల్ సబ్ డివిజన్
జిల్లా: అనంతపురం
పాల్గొన్నవారు : 200
ఈరోజు అనంతపురం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పి.వి.కే.కే, ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో “ బ్రేక్ ది సైలెన్స్ – కాల్ 1972 ” మరియు “ ఆపరేషన్ త్రిశూల్” కార్యక్రమాలలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈగల్ ఆంధ్రప్రదేశ్ సంస్థ లక్ష్యాలు, విధులు, మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు ఎన్‌డీపీఎస్ చట్టం గురించి విద్యార్థి, విద్యార్థినులకు వివరించడం జరిగింది. మాదకద్రవ్యాల విక్రయాలు, సరఫరా, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం తెలిసినప్పుడు నిశ్శబ్దంగా ఉండకుండా ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించడం జరిగింది. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేయడం జరిగింది.
అలాగే మహిళల భద్రత, బాలికల రక్షణ, వ్యక్తిగత భద్రత, రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం జరిగింది. ఈగల్ క్లబ్బుల ఏర్పాటు, సామాజిక బాధ్యతలో విద్యార్థుల భాగస్వామ్యం మరియు ఈగల్ ఆంధ్రప్రదేశ్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి,విద్యార్థినులతో ఈగల్ ప్రతిజ్ఞలు చేయించడంతో పాటు, అనంతపురం జిల్లా ఇంస్టాగ్రామం ఐడి ఫాలో చేపించినాము మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మొత్తం 200 మంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. సుమారు 70 మంది విద్యార్థినులతో ఈగల్ ప్రతిజ్ఞలు చేయించగా, సుమారు 70 మంది ఈగల్ సామాజిక మాధ్యమ ఖాతాలకు సభ్యత్వం పొందడం జరిగింది.
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం, మహిళల భద్రత, విద్యార్థుల రక్షణ మరియు ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.