BREAK THE SILENCE – CALL 1972
📅 తేదీ: 26-10-2026
📍 జిల్లా: గుంటూరు
సబ్ డివిజన్: గుంటూరు WEST SUB DIVISION
పోలీస్ స్టేషన్: అరండల్‌పేట
ప్రాంతం: వెంగళరావు నగర్
వేదిక: మునిసిపల్ హైస్కూల్
పాల్గొన్న విద్యార్థులు:* 70 మంది
🔰 మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం – విద్యార్థులకు ఈగల్ సెల్ అవగాహన
🔰 మౌనాన్ని వీడండి.. మాదకద్రవ్యాల సమాచారాన్ని 1972కు అందించండి!
🔸ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ *శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారు మరియు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి స్వరూప రాణి గారి సూచనలతో గుంటూరు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో "BREAK THE SILENCE" మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
🔸ఈ రోజు (26-10-2026) మధ్యాహ్నం 3:00 గంటలకు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ మునిసిపల్ హైస్కూల్‌లో సుమారు 70 మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది.
🔸ఈ కార్యక్రమానికి గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై శ్రీ ఎం. సునీల్ బాబు గారు మరియు ఎస్సై శ్రీ రాజశేఖర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
🔸ఈ సందర్భంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలను వివరించారు. మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజేస్తూ, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
🔸అలాగే, "BREAK THE SILENCE – మౌనాన్ని వీడండి" కార్యక్రమంలో భాగంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఏ విధంగా అందించాలో వివరించారు.
🔸ప్రత్యేకంగా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ప్రాముఖ్యత, పనితీరు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972కు తెలియజేసి, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
🔸ఈ కార్యక్రమంలో గుంటూరు ఈగల్ సెల్ ఎస్సైలు ఎం. సునీల్ బాబు, రాజశేఖర్, ఈగల్ సెల్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.