పోలవరం జిల్లా,
రంపచోడవరం
తేదీ. 26-10-2026
🩸 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం – రక్తదానం చేసిన EAGLE సిబ్బంది
📍పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రంపచోడవరం పోలీస్ స్టేషన్‌లో పోలవరం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
🤝ఈ సందర్భంగా EAGLE (Elite Anti Narcotics Group for Law Enforcement) సిబ్బంది శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
🩸 సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ప్రాణదానంగా నిలిచే రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
🙏పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవా స్ఫూర్తిని కొనసాగించడంలో భాగంగా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
“రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రక్తదాన ప్రాముఖ్యతను చాటిచెప్పారు.